యువత కోసం మరో బైకును ప్రవేశపెట్టిన బజాజ్

Tuesday, March 12, 2019 11:24 AM Automobiles
యువత కోసం మరో బైకును ప్రవేశపెట్టిన బజాజ్

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి సరికొత్త పల్సర్ 180ఎఫ్ బైకును నియాన్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. బజాజ్ లైనప్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 220ఎఫ్ మోడల్ స్టైల్‌ను 180ఎఫ్ మోడల్‌లో పరిచయం చేయడమే ఈ నియాన్ ఎడిషన్ ప్రత్యేకత. డిజైన్ పరంగా యువతను ఎంతగానో ఆకట్టుకోనుంది. అంతే కాకుండా సేల్స్ పెంచుకునే క్రమంలో బజాజ్ తమ 180ఎఫ్ నియాన్ ఎడిషన్ బైకును అత్యంత సరసమైన ధరలో కేవలం రూ. 87, 450 లకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

బజాజ్ పల్సర్ 180ఎఫ్ నియాన్ ఎడిషన్ బైకులో సాంకేతికంగా 178.6సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ డీటీఎస్-ఐ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 17బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ శ్రేణి బైకుల్లో ఇదే శక్తివంతమైన మోడల్ కావడం మరో విశేషం. సేఫ్టీ విషయానికి వస్తే ముందు చక్రానికి 260ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ మరియు వెనుక చక్రానికి 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అమర్చడం జరిగింది. మెరుగైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) కూడా అందివ్వడం జరిగింది.

For All Tech Queries Please Click Here..!