నేటి వాతావరణ సమాచారం
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోవైపు మిగతా జిల్లాల్లో భానుడి భగభగలు కొనసాగనున్నట్లు తెలిపింది. ఇతర జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.