నేడు పిడుగులతో కూడిన వర్షం
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్,ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో వడగండ్ల వర్షం అవకాశం ఉందని తెలిపింది. అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది.