ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అలాగే తెలంగాణలో ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-50km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అటు ఈ నెల 22 వరకు రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.