రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం
ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. కాగా, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.