భారీ వర్షాలు.. రాకపోకలకు ఇబ్బందులు
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లోని మలక్పేట, దిల్సుఖ్నగర్, సరూర్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, బేగంపేట్, అల్వాల్, సైదాబాద్, చాదర్ ఘాట్, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, యూసఫ్ గూడ, అమీర్ పేట్ వంటి పలుచోట్ల వర్షాలు పడి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరంగల్, సూర్యాపేటలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.