అలెర్ట్: ఐదు రోజులు బయటికెళ్ళద్దు
ఉపరితల ద్రోణి ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఈ ఐదు రోజులు పలు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.