రానున్న రెండు రోజుల్లో భారీ వర్ష సూచన

Weather Published On : Monday, December 3, 2018 10:13 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తూర్పుగాలులు వీచే వాతావరణం నెలకొంది. దీంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో దాదాపు పొడివాతారణం నెలకొంటుంది. ఉత్తరం నుండి వీస్తున్న గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు ఓ మోస్తారుగా తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా, డిసెంబర్ 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది, ఇది బలపడే వరకు దీని ప్రభావం ఎలా ఉండనుందనే విషయాన్ని చెప్పలేమని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.