ఈ జిల్లాల్లో ఉక్కపోత.. ఎండ వేడిమి

Weather Published On : Wednesday, June 4, 2025 08:27 AM

బుధవారం కోస్తా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.