అలెర్ట్: భారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సోమవారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.