వీరు చెరుకు రసం తాగితే.. ఇక అంతే సంగతి..!
వేసవికాలంలో అందరిచూపు చెరకురసంపైనే ఉంటుంది. అయితే చెరుకు రసం తాగడంవల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మండే ఎండలో చెరకురసం శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. దీనిలోని లవణాలు నోటి దుర్వాసన నుండి రక్షించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతాయి. ఎన్నో ఆరోగ్యసూత్రాలు చెరకులో దాగి ఉన్నా కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం దీనిని తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. చెరకులో అధికంగా చక్కెర ఉండటం వల్ల షుగర్ ను మరింత పెంచుతుంది.