ఆ ఫోన్లలో రేపటి నుండి వాట్సాప్ బంద్
జూన్ 1 నుంచి వాట్సాప్ కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఫోన్ లలో పని చేయదు. ఈ మేరకు మెటా ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి మే లోనే వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్లలో నిలిచిపోవాల్సి ఉన్నా వినియోగదారులకు తగినంత సమయం ఇచ్చేందుకు సంస్థ నెల పాటు అదనపు గడువు ఇచ్చింది. వినియోగదారుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి IOS15 లేదా అంతకు ముందు IOS వర్షన్ లు ఉన్న ఐఫోన్ లలో వాట్సాప్ పనిచేయదని తెలిపారు.