ఒకేసారి 32 మందితో వీడియో కాల్ మాట్లాడొచ్చు.. ఎలానో తెలుసా..
మెటా కంపెనీ వాట్సాప్ యూజర్ల కోసం కొత్త యాప్ ను లాంచ్ చేసింది. 'వాట్సాప్ ఫర్ ఐప్యాడ్' యాప్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐప్యాడ్ యాప్. ఈ యాప్ ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాట్లాడొచ్చు. అలాగే ఈ యాప్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాను కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ వంటి అధునాతన మల్టీ టాస్కింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.