వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, వీటితో మీ మొబైల్ రూపు మారిపోతుంది

Technology Published On : Thursday, October 3, 2019 05:30 PM

మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానం‌తో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ వారి కోరికల మేరకు కూడా వాట్సప్ మార్పులు చేపడుతోంది. ఇప్పుడు వినియోగదారుల కోసం 4 ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అవేంటో చూద్దాం.. 

Dark Mode: 
ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 లోకి వచ్చిన ఈ డార్క్ మోడ్ ఫీచర్ త్వరలో వాట్సప్‌లో కూడా రాబోతోంది. వాట్సప్‌లో డార్క్ మోడ్ వస్తే కళ్లకు అలసట తగ్గించడంతో పాటు బ్యాటరీని ఆదా చేస్తుంది.

Boomerang Videos: 
 ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన ఈ బూమరాంగ్ వీడియో ఫీచర్ త్వరలో వాట్సప్‌లోకి కూడా రానుంది. ఇప్పటికే ప్యానెల్‌లో వీడియో లేదా GIF ఫార్మాట్‌ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ గురించి అధికారికంగా ప్రకటన అయితే లేదు.

Memoji stickers: 
యూజర్లు పర్సనలైజ్డ్ స్టిక్కర్స్, ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి ఈ Memoji  ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు 2.19.90.23 బీటా వర్షన్‌లో Memoji  ఫీచర్‌ను అందించింది. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ త్వరలో రానుంది.

Albums: 
వాట్సప్ వెబ్‌ వర్షన్‌లోకి కొత్తగా ‘Albums’ ఫీచర్ రానుంది. ఫోటోస్, వీడియోస్‌ని గ్రూప్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మొబైల్ యాప్‌లో 2018లోనే ఈ ఫీచర్ వచ్చింది.వెబ్ వర్షన్‌కు కూడా రానుంది.