Vivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే,. 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీ

Technology Published On : Friday, February 28, 2020 05:44 PM

వివో సంస్థ కూడా సరసమైన ధరల వద్ద 5G స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారుల జాబితాలో చేరింది. షియోమి, రియల్‌మి మరియు ఒప్పో సంస్థల తరువాత వివో ఇప్పుడు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేసింది. వివో Z6 5Gగా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్-రేంజ్ విభాగంలో అద్భుతమైన స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంది.వివో Z6 5G యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు వెనుకవైపు 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.