ఫోన్ వేడెక్కడానికి కారణాలు
వేసవిలో అధిక శాతం మొబైల్ ఫోన్లు వేడెక్కుతూ ఉంటాయి. ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. సూర్యకాంతి నేరుగా మొబైల్ గ్లాస్ పై పడటం వల్ల వేడెక్కుతూ ఉంటుంది. ఒకవేళ కంపెనీ చార్జర్ కాకుండా వేరే చార్జర్ వాడినప్పుడు కూడా వేడెక్కుతుంది.
డ్యామేజ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వేడెక్కి కొన్ని సందర్భాల్లో పగిలిపోతాయి. గంటలు గంటలు చార్జింగ్ పెట్టడం వల్ల కూడా ఫోన్లు పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వాడాలి.