జాగ్రత్త.. వాట్సాప్ లో కొత్త మోసం
సైబర్ నేరగాళ్లు వాట్సప్ లో ఫొటో పంపి స్టెగనోగ్రఫీ అనే కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఆ ఫొటోను డౌన్లోడ్ చేయగానే ఖాతాల్లోని నగదు మాయం అవుతోంది. బైనరీ కోడ్ తో ఉన్న ఫొటో ద్వారా మాల్వేర్ డివైజ్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మన నంబర్లకు వచ్చే OTPలూ కేటుగాళ్లకు చేరతాయి. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫొటోలు డౌన్లోడ్ చేయొద్దని, ఇమేజ్ ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.