Jio Phone: జియో ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్ కావడం లేదా, అయితే ఇలా చేయండి
దేశీయ మార్కెట్లో సంచలనం రేపిన ఫోన్ ఏదైనా ఉందంటే అది జియో ఫోన్ మాత్రమే. ఇంకా చెప్పాలంటే జియో రాకతో టెలికం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. అత్యంత తక్కువ ధరకు డేటా ధరలు రావడంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు దీన్ని క్యాష్ చేసుకునేందుకు తక్కువ ధరకే ఫోన్లను ప్రవేశపెట్టాయి. ఈ నేపధ్యంలోనే జియో ఫోన్ అధ్భుత ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువచ్చింది. జియోఫోన్ Kai OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ జియో ఫోన్‌లో యాప్ స్టోర్ ముందే ఇంస్టాల్ చేయబడి వస్తుంది. దీని ద్వారా వినియోగదారులు హ్యాండ్‌సెట్ కోసం అవసరమైన యాప్ లను మరియు గేమ్ లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ యూట్యూబ్ యాప్ ను (ouTube Videos On Jio Phone) కూడా కలిగి ఉంది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన సినిమాలు, కంటెంట్ చూడవచ్చు. అయితే కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మీరు చూడటానికి మీకు నచ్చిన కొన్ని వీడియోలను సేవ్ చేయాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. JioPhone లోని YouTube వీడియోలను ఆఫ్‌లైన్‌లో చూడటానికి డౌన్‌లోడ్ (Download YouTube Videos On Jio Phone) చేయడానికి లేదా సేవ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అది ఎలాగో ఓ సారి చూద్దాం.
JioPhoneలో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే పద్ధతులు:
ముందుగా JioStoreను ఓపెన్ చేసి YouTube యాప్ యొక్క తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయండి.
డౌన్‌లోడ్ అయిన తర్వాత యాప్ ను ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన వీడియో కోసం సెర్చ్ చేయండి.
గమనిక : JioPhone టచ్ డిస్‌ప్లేను కలిగి లేనందున యాప్ నావిగేషన్ పాత మోడల్ D- ప్యాడ్ ఆధారంగా చేయవలసి ఉంటుంది.
మీకు కావలసిన వీడియో లోడ్ అయిన తర్వాత వీడియో యొక్క URLను నావిగేట్ చేసి దాని ముందు 'ss' అనే దానిని జోడించి 'ok' బట్టెన్ ను నొక్కండి.
ఇది మిమ్మల్ని మరొక వెబ్‌సైట్‌కు తీసుకువెళుతుంది. తరువాత క్రిందికి స్క్రోల్ చేసి అందులో వీడియో యొక్క ఏ క్వాలిటీ సైజ్ ను ఎంచుకోండి.
ఆ తరువాత డౌన్‌లోడ్ బటన్‌ను ఎంచుకొండి.