Lending Applications Removed: రుణాలు అందించే యాప్స్ ను తొలగించిన గూగుల్ 

Technology Published On : Wednesday, January 6, 2021 01:00 PM

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తాజాగా మరో ఐదు యాప్స్‌ను తొలగించింది.  వినియోగదారులకు స్వల్ప కాలిక రుణాలు అందించే ఈ ఐదు యాప్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ వినియోగదారులకు ఎక్కువ వడ్డీరేట్లకు స్వల్పకాలిక రుణాలను అందించడంతో పాటు తిరిగి చెల్లించడానికి రుణగ్రహీతలను వేధించాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో తమ గూగుల్ ప్లేస్టోర్ డెవలపర్ విధానాలు వినియోగదారులను కాపాడటానికి, వారిని సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడినవని గూగుల్ ఈ సందర్భంగా ప్రకటించింది. 

టెక్నాలజీ సంస్థ గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుండి తొలిగించిన వాటిలో ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఈకాష్, స్నాప్ ఇట్‌ లోన్‌ యాప్స్ ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యక్తిగత రుణాల నిబంధనల నుంచి ప్రజలను కాపాడటం కోసం తమ ఆర్థిక సర్వీసుల విధానాలను విస్తరించినట్లు పేర్కొంది. ఈ యాప్స్ ఫీచర్లు కూడా మనదేశ చట్టాల పరిధిలోకి రావు. కాబట్టి ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి.