ఫేస్ బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారా...
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని అమీర్ పేటకు చెందిన 48ఏళ్ల ఓ వ్యాపారవేత్తను సైబర్ మోసగాళ్లు ట్రాప్ చేసారు. గత ఫిబ్రవరిలో మాధవి రెడ్డి అనే మహిళ పేరుతో ఆ వ్యాపారవేత్తకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయగా స్టాక్ మార్కెట్ కన్సల్టెంట్ గా పరిచయం పెంచుకుంది. ఒక వెబ్ సైట్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభాలు వస్తాయంటూ రూ.2.6కోట్లు కాజేశారు. సో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే ముందు ఒక సారి వెరిఫై చేసుకోండి.