ఫోన్ పే,గూగుల్ పే, పేటిఎం యూజర్లకు బిగ్ షాక్
ఫోన్ పే,గూగుల్ పే, పేటిఎం యూజర్లకు బిగ్ షాక్ తగలనుంది. నేటి కాలంలో, ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ చెల్లింపులు పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇప్పటి వరకు UPI లావాదేవీలపై ఎటువంటి పన్ను లేదు. కానీ ఇకపై రూ.2000కి మించి చేసే ట్రాన్సాక్షన్స్ పై 18 శాతం GST విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే జరిగితే UPI లావాదేవీలకే అదనపు భారం పడనుంది. ఈ పన్నును ముందుగా వ్యాపారి, వ్యాపార లావాదేవీలపై తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.