విరాట్ కోహ్లికి భారతరత్న ఇవ్వాలి: సురేష్ రైనా
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇటీవల టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను కోహ్లికి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. కోహ్లి ఇండియన్ క్రికెట్కు ఎన్నో సేవలు చేశారని.. దీనికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలన్నారు. అయితే క్రీడల్లో మొదటిసారిగా భారతరత్నను సచిన్ టెండూల్కర్ కు ఇచ్చిన విషయం తెలిసిందే.