IPL 2025: చెన్నై ఓటమి.. ముంబై ఘన విజయం
IPL 2025 లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఇక చెన్నె ఇచ్చిన టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. ముంబై బ్యాటర్ లలో రికెల్ టన్(24) రోహిత్ శర్మ(76), సూర్య కుమార్ యాదవ్ 68 పరుగులు చేశారు.