IPL 2025: ముంబై ఘన విజయం
IPL-2025 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో SRH జట్టు ఓటమి పాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు హైదరాబాద్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 రన్స్ మాత్రమే చేసింది. ఇక టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 15.4 ఓవర్లోనే 144 లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.