IPL 2025: ఈ రోజు గెలవకపోతే ఇంటికే..
లక్నో వేదికగా ఈ రోజు లక్నో, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో లక్నో తప్పనిసరిగా గెలవాల్సిందే. 11 మ్యాచుల్లో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న లక్నో మిగతా 3 మ్యాచ్లు గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ రోజు ఓడితే అధికారికంగా ఎలిమినేట్ అయినట్లే. మరోవైపు ఇప్పటికే ఎలిమినేట్ అయిన సన్ రైజర్స్ పై ఎలాంటి ఒత్తిడి లేనందున చెలరేగి ఆడే అవకాశం ఉంది.