IPL 2025: రాహుల్ కొత్త రికార్డు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ పై 57 రన్స్ చేసి అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు సాధించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. దీంతో వార్నర్, కోహ్లి వంటి ప్లేయర్లను వెనక్కి నెట్టాడు. రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్ లో 5,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు.