కుమార్తె పేరు రివీల్ చేసిన కేఎల్ రాహుల్
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్, నటి అతియా శెట్టి దంపతులు ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవలే తమ జీవితాల్లోకి వచ్చిన తమ గారాలపట్టిని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ జంట ఆమె పేరును ప్రకటించింది. తమ కుమార్తెకు ఇవారా అని పేరు పెట్టినట్లు చెప్పారు.“మా బేబీ గర్ల్.. మా ప్రపంచం. ఇవారా భగవంతుడి కానుక” అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.