IPL 2025: హైదరాబాద్ ఘోర ఓటమి
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో హైదరాబాద్ ఘోర ఓటమిపాలైంది. 38 పరుగుల తేడాతో గుజరాత్ ఘనవిజయం సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది.