Breaking: మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యాచేంద్ర (94) కన్నుమూశారు. నెల్లూరులోని తన నివాసంలో కన్నుమూశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థానానికి చెందిన యాచేంద్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆంధ్ర జట్టు తరఫున ఆయన 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. ఆయన1956-57లో ట్రావెన్కోర్- కొచ్చి జట్టుతో గుంటూరులో జరిగిన మ్యాచ్ తో రంజీలోకి అరంగేట్రంలోకి చేశారు.