IPL 2025: రేపు మ్యాచ్.. ప్లేయర్ కు గాయం
ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ముకేశ్ కుమార్ విసిరిన బంతి రాహుల్ కుడి మోకాలుకు తగలడంతో గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే రాహుల్ నెట్స్ లో నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లినట్లు సమాచారం. దీంతో రేపు ముంబైతో జరగబోయే మ్యాచులో ఆయన ఆడకపోవచ్చని తెలుస్తోంది.