రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్
ఈ నెల 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగనున్న మ్యాచ్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ పక్కటెముకకు గాయమైంది. దీంతో వరుసగా రెండో మ్యాచ్ కు దూరమవనున్నాడు. శాంసన్ ప్రస్తుతం జైపూర్లో పునరావాసం పొందుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడని ఫ్రాంచైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.