10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న హెలికాప్టర్ ధ్వంసం ఘటనకు సంబంధించి 10 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు ధర్మవరం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.