రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. జాతీయ రహదారులకు భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కోరారు. రహదారులు పూర్తయితే మరింత రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకు సహకరించండి అంటూ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో 2,500 కి.మీ. జాతీయ రహదారులు నిర్మించామన్నారు. 16 జాతీయ రహదారులకు 1,550 హెక్టార్ల భూమి అవసరమని, ఇప్పటి వరకు 904 హెక్టార్ల భూమి ఇచ్చారని, మిగిలిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆ లేఖలో కిషన్ రెడ్డి కోరారు.