GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన టీఆర్ఎస్ 

Politics Published On : Sunday, January 3, 2021 12:00 PM

Hyd, Nov 23: ‌డిసెంబర్ 1న జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో (GHMC Elections 2020) భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను (TRS Manifesto) విడుదల చేసింది. మొత్తం 16 పేజీలతో కూడిన మేనిఫోస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నగరంలో పలు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించన్నట్టు సీఎం (CM KCR) తెలిపారు. పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను (TRS Manifesto For GHMC Elections) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌జా ర‌వాణాకు పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్  మ్యానిఫెస్టోలో చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టు రెండో ద‌శ‌లో లైన్‌ల‌ను రాయ‌దుర్గం నుంచి శం‌షాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు, బీహెచ్ఈఎల్ నుంచి మెహిదీప‌ట్నం వ‌ర‌కు విస్త‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌న‌డానికి హైద‌రాబాద్ మెట్రో రైల్ స‌జీవ తార్కాణ‌మ‌ని చెప్పారు.

ప్ర‌యాణికులు ఎలాంటి ఆల‌స్యం లేకుండా వేగంగా శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి వెళ్ల‌డం కోసం ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్ ప్రాజెక్టును అమ‌లు చేయ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు. అందుకు ఇప్ప‌టికే రాష్ట్ర కేబినెట్ అనుమ‌తి ల‌భించింద‌ని, ఈ ప్రాజెక్టు పూర్త‌యితే న‌గ‌రంలోని అన్ని ప్ర‌ధాన కేంద్రాల నుంచి మెట్రో రైల్ నేరుగా ఎక్క‌డా ఆగ‌కుండా విమానాశ్రయానికి చేరుకుంటుంద‌ని చెప్పారు. న‌గ‌ర ప్ర‌జ‌ల రోజువారీ రాక‌పోక‌ల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా చేయ‌డం కోసం ఇప్ప‌టికే ర‌హ‌దారులు మెట్రోరైలు విస్త‌ర‌ణ చేప‌ట్టామ‌ని, ఇక‌పై ఎంఎంటీఎస్ రైళ్ల‌ను కూడా విస్త‌రిస్తామ‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

TRS Manifesto For GHMC Elections
1. త్వరలో హైదరాబాద్ లో ఉచిత వైఫై అందించనున్నారు.
2. మూసీ నది పునరుద్ధరణ, సుందరీకరణ కోసం రూ.12 వేల కోట్ల ఫండ్ ఏర్పాటు
3. జనవరి నుంచి కొత్తగా వచ్చే నాలా చట్టానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
4. డిసెంబర్ నుంచి ఉచిత నీళ్ల బిల్లు ఉండదు. 24 గంటలు మంచినీటి సరఫరా. ఉచితంగా 20 వేల నీళ్లు సరఫరా
5. సెలూన్లు, ధోబీలు, లాండ్రీలకు ఉచితంగా విద్యుత్ సరఫరా
6. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు, బీహెచ్ఈఎల్ నుంచి మెహిదీపట్నం వరకు మెట్రో లైన్ ఏర్పాటు.
7. రూ.10 కోట్ల బడ్జెట్ లోపు తీసే సినిమాలకు జీఎస్టీ (GST ) మినహాయింపు. 
8. ఇకపై నగరంలో హైటెన్షన్ వైర్లను అండర్ గ్రౌండ్ లో ఉంచనున్నారు.
9. బస్తీల్లోని ప్రభుత్వం మోడల్ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంలో విద్యాభ్యాసం
10. హైదరాబాద్ ( Hyderabad ) నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.