ప్రధాని మోడీతో రాహుల్ గాంధీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సీబీఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగినట్టు సమాచారం. అటు, పహల్గాం దాడికి సంబంధించి పాకిస్థాన్ తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్ధరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.