ప్రజల సమస్యలు వినడం కోసం పవన్ కళ్యాణ్ కొత్త మార్గం
ప్రజల సమస్యలు వినడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. భద్రతా కారణాలు, ఫ్యాన్స్ తాకిడి వల్ల నేరుగా ప్రజలను కలవడం సవాలుగా మారింది. అందుకే 'మన ఊరికోసం మాటామంతీ' అనే స్క్రీన్ గ్రీవెన్సు ప్రారంభిస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచే శ్రీకాకుళం జిల్లా రావివలస భవానీ థియేటర్ కు వచ్చే ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులూ పాల్గొంటారు.