ఉగ్రవాదం వేరు ముస్లిం సమాజం వేరు: పవన్ కళ్యాణ్
కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం వేరు. ఉగ్రవాదులు వేరు..మామూలు ముస్లిం సమాజం వేరు... అని అన్నారు. సమాజంలో శాంతియుతంగా ఉండే, శాంతి భద్రతలు కోరుకునే ముస్లిం సమాజం వేరు అని ఆయన అన్నారు. అంతేకాదు, కొందరు ఉగ్రవాదుల చర్యల వల్ల మొత్తం ముస్లిం సమాజాన్ని నిందించడం సరైనది కాదని, ఆ స్పష్టత తమందరికి ఉందని, ఎన్డీఏ ప్రభుత్వానికీ ఉందని ఆయన స్పష్టం చేశారు.