దూకుడు పెంచిన పవన్.. జగన్ కు ఇక చుక్కలే..!!

Politics Published On : Tuesday, June 25, 2019 11:53 AM

అసలు పవన్ రాజకీయాల్లో ఉండగలడా లేదా అనే చర్చలు నిన్నటి వరకు జరిగాయి. ప్రజారాజ్యం బాటలోనే జనసేన కూడా నడుస్తుందని, ప్రజారాజ్యం కొన్ని స్థానాలు గెలిచినా పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. కానీ, జనసేనకు ఒక్క స్థానం మాత్రమే రావడంతో జనసేనను మూసేస్తారని వార్తలు జోరుగా వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. పార్టీ విధానాలను ప్రకటించింది. కార్యకర్తల స్థాయి నుంచి ఎదగాలని జనసేన నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే విజయం సాధించగలమని జనసేనానికి అర్థం అయింది.

అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసింది జనసేన. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పార్టీ వాయిస్ ను గ్రామాల్లో బలంగా వినిపించాలని కమిటీలకు సూచించారు. ఏడాది వరకు జగన్ ప్రభుత్వం గురించి ఏమి మాట్లాడబోమని, ముందు తమ పార్టీ బలం పుంజుకోవడంపైనే దృష్టిపెడతామని పవన్ అంటున్నాడు. కరకట్ట విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పవన్ స్వాగతించారు. ఒక్క ప్రజావేదిక విషయంలోనే కాకుండా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నింటిని కూల్చివేయాలని, అప్పుడు జగన్ పై ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని పవన్ అన్నారు.