పవన్ కల్యాణ్ పై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో సినిమా టికెట్ల ధరల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, అధికారంలోకి వచ్చాక ఆయన మాట మార్చారని ఆరోపించారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలను బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.