బ్రేకింగ్ : ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాద్

Politics Published On : Monday, September 16, 2019 01:11 PM

టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం గమనార్హం. ఇక గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న ఆయన.. కొన్ని రోజులక్రితం గుండెపోటుకు లోనయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి ఆత్మహత్య కాదా అని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది