జూన్ 4న వెన్నుపోటు దినం: వైసిపి
కూటమి అరాచకపాలనపై జున్ 4ను వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నామని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జూన్ 4తో ఏడాది అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారని.. సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికారని చెప్పారు. అప్పుడు మామకు వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు ప్రజలను నేరుగా పోటు పొడిచారని పేర్కొన్నారు.