జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తాం: ఆది నారాయణ రెడ్డి
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తామని అన్నారు. వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందని ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వైసీపీ నేతలతో పాటు ఒక వర్గం మీడియా బురద చల్లేందుకు ప్రయత్నిస్తుందన్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు జమ్ముకశ్మీర్ ముష్కరుల కంటే ప్రమాదం అంటూ వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆదినారాయణరెడ్డి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగున ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ కుటుంబానికి చెందిన ట్రక్కుల్ని కూడా అడ్డుకున్నారు. ఈ వివాదం సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. దీంతో ఇరువర్గాల్ని పిలిచి రాజీ చేశారు. అయితే ఆ తర్వాత కడప జిల్లాలో సీమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఆదినారాయణరెడ్డి చేస్తున్న రచ్చపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇదంతా వైసీపీపై పోరాటమే అంటూ ఆది చెప్పుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.