కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జగన్
కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ మేరకు సమాజంలోని అన్ని వర్గాలకు అసలైన సామాజిక న్యాయం ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుందని వెల్లడించారు. సమ్మిళిత అభివృద్ధికి ఇది కీలక అడుగని జగన్ తెలిపారు. వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కులగణన దోహదపడుతుందని పేర్కొన్నారు. 2024 జనవరిలో దేశంలోనే తొలిసారిగా కులగణన చేసినట్లు జగన్ తెలియజేశారు.