చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో ప్రజల తీర్పును తారుమారు చేయడానికి సీఎం చంద్రబాబునాయుడు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీచేస్తున్నారని, ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం ఆయన దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు.