చంద్రబాబుకు జగన్ రిక్వెస్ట్
రాష్ట్రంలో కనీస గిట్టుబాటు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడంలేదని YCP అధినేత జగన్ అన్నారు. కనీస మద్దతుధర లేక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని జగన్ ఆరోపించారు. ఈ మేరకు రైతుల పట్ల కనీస బాధ్యత చూపి రైతులను ఆదుకోవాలని జగన్ ఏపీ సీఎం చంద్రబాబును 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు