రాజధాని పనుల పున: ప్రారంభోత్సవానికి జగన్ కు ఆహ్వానం
అమరావతి పనుల పున: ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ కు ఆహ్వానపత్రికను పంపారు. ఈ మేరకు రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు రావాలని సీఎం తెలిపారు. అయితే తాడేపల్లి నివాసంలో జగన్ అందుబాటులో లేకపోవడంతో జగన్ పీఏకు ప్రొటోకాల్ అధికారులు ఆహ్వాన పత్రికను అందించారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో పాల్గొని రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కూటమి ప్రభుత్వం కోరింది. మరి ఆయన వస్తారో లేదో వేచి చూడాల్సిందే..