జగనన్నా ఇలాంటివి పట్టించుకోండి , లేకుంటే మనకీ ముందు ముందు కష్టాలే..!

Politics Published On : Saturday, May 2, 2020 06:04 PM

జగన్ అన్నా నీ కోసం 9 సంవత్సరాలు పార్టీ జెండా మోసి నీ గెలుపు మా గెలుపనుకుని అహర్నిశలు కష్టపడి నీ పరిపాలనలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ ఉన్నత అభివృద్ధి కోసం కష్టపడిన కార్యకర్తకే ఇలాంటి పరిస్థితి వస్తే రేపొద్దున్న మా పరిస్థితి ఏంటి?? మొదటినుండి పార్టీ కోసం శ్రమించిన మా కంటే తన స్వార్థపూరిత రాజకీయాలు కోసం, కేసులు కోసం, ఎన్నో కుట్రలు పన్నుతూ ఊసరవెల్లిలా తన అవసరానికి తగ్గట్టు పార్టీ జెండా మార్చే తోట త్రిమూర్తులే ఎక్కువయిపోయాడా? పార్టీని గెలిపించింది అతను కాదన్నా మేము, ఓడిపోయినవాడు గెలిచిన మన పార్టీలోకి వచ్చి టీడీపీలో వాడి ఓటమికి కారణమైన మన కార్యకర్తలను వేటాడి నరికిస్తున్నాడు.

వాడికి పార్టీ ముఖ్యం కాదు అధికారమే ముఖ్యం, మీకు పార్టీ కార్యకర్తలు అవసరం లేదా అన్నా??? ఒక్కసారి మా కోసం కూడా ఆలోచించు జగనన్న. మీరే మా ధైర్యం, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు మీ కోసం ఎంతకైనా తెగించే దమ్ముంది దయచేసి మా వేదనను అర్ధం చేసుకోండి మిమ్మల్ని నమ్ముకున్న మాలాంటి కార్యకర్తలకు సహాయం చేయకపోయినా పర్వాలేదు అన్యాయం జరగనివ్వకండి చాలు. ఇశ్రాయేల్ గారికి ఉన్నంత ధైర్యం, తట్టుకునే శక్తి మాకు లేవు. దయచేసి మా విన్నపాన్ని అర్ధం చేసుకుని ఈ కేస్ పై లోతైన విచారణ జరిపించి A1 ముద్దాయి అయిన తోట త్రిమూర్తులుని కఠినంగా శిక్షించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఇదే ప్రతి వైస్సార్ కార్యకర్త మీ నుండి కోరుకునేది, దీన్ని కోసం ఆలోచించి న్యాయం చేసి మాలాంటి కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వు జగనన్న. జై జగన్ జై జై వైస్సార్....