కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణంలో కీలకపాత్ర కానీ.. ఆహ్వానమే లేదా!

Politics Published On : Friday, June 21, 2019 09:00 AM

టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన పార్టీలో కెసిఆర్ కుటుంబ సభ్యుల మద్య పోరాటం జరగగా, ఆ వారసత్వ పోరులో కెసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు జరిగింది చాలా అన్యాయమనే ప్రజలు అంటున్నారు. దానికి ముఖ్యమంత్రి సెంటిమెంటుతో "చెక్" పెట్టిన సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం వారసత్వ పోరు తారాస్థాయికి చేరిందని, ఆ క్రమంలో హరీశ్ రావు వార్తలను తమకు అనుకూలంగా ఉండే మీడియాలో రాకుండా కేసీఆర్‌ చక్రం తిప్పారనే విషయం తెరమీదకు వచ్చింది. ఈ అంతర్గత పోరు సద్దుమణగడం తెరాస యువ నాయకుడు కేటీఆర్‌, హరీశ్‌ రావు కలిసి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెద్దఎత్తున నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నద్ధమవుతున్న సంగతి విదితమే. ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ను ఈ కార్యక్రమానికి కేసీఆర్‌ ఆహ్వానించారు. అయితే, ఈ ప్రాజెక్టు పనుల్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఎక్కడా అవకాశం దక్కలేదు. ఈ సంఘటన అన్ని రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.