బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందని సయ్యద్ సంచలన ఆరోపణలు

Politics Published On : Friday, January 24, 2020 03:21 PM

ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ హ్యాకింగ్ చేసిందని సయ్యద్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కుట్రకి కేంద్రం హైదరాబాద్ అని చెప్పి బాంబు పేల్చాడు. ఈసీఐఎల్ రూపొందించిన ఈవీఎంల రూపకల్పన బృందంలో సభ్యుడైన షుజా. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ విడుదల చేసే మాడ్యులేటర్‌తో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసినట్టు గుర్తించానని తెలిపాడు.

ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పడమే కాదు. లండన్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్వయంగా ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో చూపించాడు సయ్యద్. నాడు హ్యకింగ్ విషయం బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండేకు తెలుసని. ఎన్నికలయ్యాక ఆయన్ని చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈవీఎం ట్యాంపరింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని సయ్యద్ చెప్పాడు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి, తాను అమెరికాకు రాజకీయ శరణార్ధిగా వెళ్లానని తెలిపాడు. భారత్‌లో వాడిన ఈవీఎంల తయారీలో తాను కూడా పాల్గొన్నానని సయ్యద్ చెప్పాడు. ఆ సమయంలో తాను ఈసీఐఎల్‌లో పని చేసేవాడినని వివరించాడు.