ఆ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించండి: కేశినేని నాని సంచలన ట్వీట్
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన ట్వీట్ చేశారు. తన సోదరుడు చిన్నిపై మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని కేశినేని చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఇసుక దందాలతో పాటు గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారని, మద్యం ద్వారా అక్రమార్జనకు పాల్పడుతున్నారని కేశినేని నాని మండిపడ్డారు.
కేశినేని నాని చేసిన ట్వీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్‍లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.